డిజిటల్ హెల్త్'లో ఏపీకి 2 గ్లోబల్ అవార్డులు : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు

HealthMinisterVidadalaRajiniInDelhi

డిజిటల్ హెల్త్'లో ఏపీకి 2 గ్లోబల్ అవార్డులు : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు
డిజిటల్ హెల్త్'లో ఏపీకి 2 గ్లోబల్ అవార్డులు : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు
డిజిటల్ హెల్త్'లో ఏపీకి 2 గ్లోబల్ అవార్డులు : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు
డిజిటల్ హెల్త్'లో ఏపీకి 2 గ్లోబల్ అవార్డులు : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు
డిజిటల్ హెల్త్'లో ఏపీకి 2 గ్లోబల్ అవార్డులు : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు
డిజిటల్ హెల్త్'లో ఏపీకి 2 గ్లోబల్ అవార్డులు : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు
డిజిటల్ హెల్త్'లో ఏపీకి 2 గ్లోబల్ అవార్డులు : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు

*'డిజిటల్ హెల్త్'లో ఏపీకి 2 గ్లోబల్ అవార్డులు : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు*

*త్వరలోనే  'ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్' ప్రారంభం*

*పేదలకు చౌకగా, సులభంగా అత్యాధునిక వైద్యమందిచడమే ముఖ్యమంత్రి గారి ధ్యేయం*

 *"ఆరోగ్య సంరక్షణ" వ్యవస్థను మెరుగుపరచడంలో వేగంగా ఏపీ అడుగులు*

*'మహిళల కోసం డిజిటల్ హెల్త్' లోగో ఆవిష్కరించిన మంత్రి రజిని గారు*

*వైద్య రంగంలో వినూత్న విధానాలు , సాంకేతికతను జోడించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు*

 *ఢిల్లీ వేదికగా జరిగిన "గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్"లో మంత్రి విడదల రజిని గారు*

పేదలకు కూడా అత్యాధునిక వైద్యం అందాలన్నదే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు వెల్లడించారు.  వృత్తిపరంగా వైద్యుడు, వ్యక్తిగతంగా గొప్ప మానవతావాదియైన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లోనే ఆయన తనయుడైన  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముందుకుసాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ వేదికపై 'డిజిటల్ హెల్త్'లో ఏపీ కైవసం చేసుకున్న 2 గ్లోబల్ అవార్డులను స్వీకరించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దార్శనికతకు నిదర్శనమన్నారు.

ఢిల్లీ వేదికగా జరిగిన రెండు రోజుల  "గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్"లో 'మహిళల కోసం డిజిటల్ హెల్త్'నేపథ్యంతో రూపొందించిన లోగోను   మంత్రి విడదల రజిని ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంపై ఆమె ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రజిని గారు మాట్లాడుతూ లభ్యత, సౌలభ్యత, ఆమోదయోగ్యత, స్థోమత  (4As) పునాదులుగా వైద్యరంగాన్ని పటిష్టంగా నిర్మించేలా ఏపీ అడుగులు వేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆస్పత్రుల్లో సమగ్ర వైద్య సదుపాయాలను కల్పిస్తూ ఐపీహెచ్ఎస్ (ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్) ప్రమాణాలననుసరిస్తూ  ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ మల్టీ స్పెషాలిటిల్లా మార్చిన ప్రక్రియను ఆమె వివరించారు. ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్  భవిష్యత్ లో మోడల్ గా నిలుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషిని మెచ్చి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ హెల్త్ విషయంలో ఇప్పటికే 6 అవార్డులను అందించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. పీపీపీ పద్ధతిలో ఏపీలో ఆర్ట్ మెడికల్ టీచింగ్ యూనివర్శిటీ, రీసెర్చ్ వర్సిటీ  ఏర్పాటు, సమగ్ర సదుపాయాలతో కాన్సర్ కేర్ సెంటర్ స్థాపన, డిజిటల్ వైద్య సేవలందించడంలో కలిసి పని చేయడానికి ముందుకు రావాలని ఔత్సాహికులను మంత్రి రజిని ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో  16 చోట్ల ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి గల అవకాశాలను  ఆరోగ్య సదస్సులో వివరించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో 'ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్'ను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ సామాజిక ఆరోగ్య సంరక్షణ పథకాల ద్వారా పౌరులందరికీ సమానమైన, సరసమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా హాజరైన వీక్షకుల ముందు ఏపీలో డిజిటల్ పరిణామం ఎలా మలుపు తీసుకుందో తెలిసేలా  శ్రీమతి నమ్మి లక్ష్మి అనే మహిళ టెలిపాథాలజీ కథను ఉదాహరణగా మంత్రి రజిని గారు వివరించారు.

1.ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా సంఖ్య:  దేశంలో ఇప్పటి వరకు సృష్టించబడిన మొత్తం ఆరోగ్య ఐడీలలో (ABHA నంబర్లు) అత్యధిక సంఖ్యగా ఏపీలోనే 3,40,15,800 ఉన్నాయి.

2. వైద్య నిపుణుల నమోదు (హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ): ఇప్పటి వరకు మొత్తం 9,500 మంది ప్రభుత్వ వైద్యులు,  11,152 స్టాఫ్ నర్సుల నమోదు ప్రక్రియ పూర్తి.

3.హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ: మొత్తం 14,182 ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలు నమోదు చేయబడ్డాయి; ఆరోగ్యశ్రీ , క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ద్వారా అన్ని ప్రైవేట్ ఆరోగ్య సౌకర్యాలను నమోదు చేయడానికి ప్రణాళిక

   

4. ABDMలోని వసతులు : మొత్తం 1769 సదుపాయాలలో ఈ-హాస్పిటల్ సాఫ్ట్ వేర్ ద్వారా 121,  డాక్టర్ కేర్ సాఫ్ట్ వేర్ ద్వారా 1648 వసతులను నమోదు చేయడం జరిగింది.

ఏఎన్ఎం మొబైల్ యాప్, ఎంవో యాప్, డాక్టర్ కేర్ ఈ- హాస్పిటల్, ఎంఎల్ హెచ్ పీ అప్లికేషన్, మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం, డాష్ బోర్డుతో డిజిటల్ హెల్త్ ను మరో మెట్టు ఎక్కించడంలో ఏపీ ముందుందన్నారు.

ఇవన్నీ డిజిటల్ హెల్త్ దిశగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు నిదర్శనమని మంత్రి గారు తెలిపారు.

ఈ సదస్సులో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జీఎస్ నవీన్ సహా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ప్రముఖులు, యూ.ఎస్.ఏ,యు.కే, యూరోపియన్ యూనియన్, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆఫ్రికా తదితర ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన నిపుణులు  వైద్యులు,శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

#YSJaganMarkGovernance