మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం
vidadalarajini about health

*మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం*
*రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు*
*ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు సందర్భంగా పోస్టర్ల ఆవిష్కరణ* ప్రతి ఒక్కరికి మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు తెలిపారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి పదే తేదీ వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లను మంత్రి విడదల రజిని గారు చిలకలూరిపేటలోని తన కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి మానసిక వైద్య విభాగం అధిపతి డి.ఉమాజ్యోతి, అసోసియేట్ ప్రొఫెసర్లు వెంటకకిరణ్, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ సాయికిరణ్ తదితరులు చిలకలూరిపేట వచ్చి మంత్రి చేతుల మీదుగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 45 కోట్ల కన్నా ఎక్కువ మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా మానసిక దుర్భలత్వంతో, వైకల్యంతో బాధపడుతున్నారని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకారం 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి అనేది రెండవ అతిపెద్ద, తీవ్రమైన వ్యాధిగా మారిందని.. అందువల్లనే మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. యోగా, వ్యాయామం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు.